Realme GT 7: 'రియల్మీ GT 7' ఫీచర్లు లీక్! పారిస్‌లో లాంచ్ ఈవెంట్.. భారత్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ! 9 month ago
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన సరికొత్త GT సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా Realme GT 7 మరియు Realme GT 7T మొబైల్‌లను.. మే 27న కంపెనీ పారిస్‌లో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్‌లు అదే రోజున భారతదేశంలో కూడా విడుదల కానున్నాయి. ఈ సిరీస్ అత్యాధునిక సాంకేతికత మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌తో..91.79% స్క్రీన్-టు-బాడీ రేషియో, పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో 7200mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఒకసారి GT 7 మొబైల్ ఫీచర్లు చుద్దాం రండి.!
Realme GT 7 ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.8 అంగుళాలు FHD+ AMOLED
రిఫ్రెష్ రేట్: 144 Hz
ప్రాసెసర్: MediaTek Dimensity 9400 Plus
పీక్ బ్రైట్‌నెస్: 6500 nits
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, Realme UI
బరువు: 203 గ్రాములు
బ్యాటరీ: 7200 mAh
ఛార్జింగ్: 100W సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్
వేరియెంట్: 12GB RAM + 256GB స్టోరేజ్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
* 50 MP మెయిన్ కెమెరా (OIS)
* 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 MP
కనెక్టివిటీ ఫీచర్లు:
* 5G, 4G డ్యూయల్ సిమ్
* Wi-Fi 7
* బ్లూటూత్ 5.4
* USB టైప్-C
* NFC
సెన్సార్లు: ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (అల్ట్రాసోనిక్), లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్
ప్లస్ పాయింట్స్:
* IP68 & IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్
* 100W సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్
* 7200 mAh తో భారీ బ్యాటరీ
* అల్ట్రా సూపర్ డిజైన్
GT 7 మొబైల్ కు సంబంధించిన ఫీచర్ల వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఈ మొబైల్ ఎన్ని వేరియెంట్స్ తో వస్తుంది.. ఏఏ రంగుల్లో ఉంటుంది.. ఇలా చాలా వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.35 వేల నుండి రూ.40 వేల వరుకు ఉండవచ్చు. ఈ ఫోన్ డిజైన్ కూడా చూడటానికి చాలా బాగుంది.. మరి దీని పనితీరు.. క్వాలిటీ ఎలా ఉంటుందో చూడాలి. Realme GT 7 కొనాలనుకునేవారు Realme వెబ్‌సైట్, అమెజాన్ ఇండియా మరియు కొన్ని ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ షాపుల్లో అందుబాటులోకి రానుంది.
ఇది చదవండి: గేమింగ్ నుండి ఫోటోగ్రఫీ వరకు! మోటరోలా ఎడ్జ్ 60 ప్రో అన్నింటా బెస్ట్ ఫోన్..!